ఘనంగా రాజేష్ బాబు జన్మదిన వేడుకలు
చిత్రం న్యూస్, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలం రాజేష్ బాబు తండాకు చెందిన జాదవ్ రాజేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బంజారా సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఘనత రాజేష్ బాబుది. పదవులో భాగంగా గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపీడీవో విధులు నిర్వహించినప్పటికీ రాజకీయ రంగ ప్రవేశం చేసి మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు అనేక పదవులు సాధించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చురుగ్గా పాల్గొంటూ స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ తో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నేరుగా రాజేష్ బాబుతో కేక్ కట్ చేసి తినిపించి పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ శాలువా, పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీ వివేకానంద ఆవాసాన్ని సందర్శించి ఆవాస ఖర్చు కోసం విరాళంగా రూ.15 వేలు విరాళంగా అందజేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు అందరూ కలిసి భైంసా గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్స్ కు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. నర్సింనగర్ తండాలో జాదవ్ రాజేష్ బాబు (మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, భైంసా) జన్మదినం సందర్భంగా నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో జన్మదిన వేడుకలు మరియు (బండరా) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.