ఘనంగా శివాంజనేయ,నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన
*పూజలు చేస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్
చిత్రం న్యూస్,బోథ్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద గల ఆలయంలో సోమవారం ఘనంగా శివాంజనేయ, నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. వేదపండితులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలోని బృందం గత మూడు రోజుల నుండి హోమ, యజ్ఞాది కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందుతాయి అన్నారు. ఆలయంలో అభయాంజనేయ స్వామి, శివపంచాయతనం, సంతాన నాగేశ్వర స్వామితో పాటు నవగ్రహాల విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. వీరి వెంట ఇచ్చోడ మాజీ ఎంపీపీ నిమ్మల ప్రీతంరెడ్డి, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.