అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.7 వేలు నగదు
రైతులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చిత్రం న్యూస్,పెద్దాపురం: కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ చేసింది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో రైతులు వారి ఆనందాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా రైతులందరూ కలిసి ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్...