అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి
మాట్లాడుతున్న ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి చిత్రం న్యూస్, నిజామాబాద్ : ఈ డబ్ల్యూ ఎస్ ను అన్ని రంగాల్లో అమలు చేయాలని ఓసి సంక్షేమ సంఘం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ లో విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వాలు మారిన అగ్రవర్ణ పేదల బతుకులు మారలేదన్నారు. పేరుకే గొప్పగా పిలవబడే జాతులు అగ్రవర్ణ ప్రజలన్నారు. ఈ రోజుల్లో అగ్రవర్ణాల ప్రజలకి అడుగడుగున అవమానాలు, అన్యాయాలు...