Chitram news
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 4:15 pm Editor : Chitram news

అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి

మాట్లాడుతున్న ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ : ఈ డబ్ల్యూ ఎస్ ను అన్ని రంగాల్లో అమలు చేయాలని ఓసి సంక్షేమ సంఘం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ లో విలేకర్లతో మాట్లాడారు.  ప్రభుత్వాలు మారిన  అగ్రవర్ణ పేదల బతుకులు మారలేదన్నారు. పేరుకే గొప్పగా పిలవబడే జాతులు అగ్రవర్ణ ప్రజలన్నారు. ఈ రోజుల్లో  అగ్రవర్ణాల ప్రజలకి అడుగడుగున అవమానాలు, అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. రిజర్వేషన్ లేక ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేక యువతీ, యువకులు బతుకులు ఆగం అవుతున్నాయాన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ డబ్ల్యూఎస్ ను  కూడా రాష్ట్రం లో పూర్తి స్థాయిలో అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో రిజర్వేషన్ పాటించటం లేదన్నారు. కింది స్థాయిలో కూడా ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వడంలో చాలా జాప్యం జరుగుతున్నదన్నారు.  ఈ కార్యక్రమంలో ఓసి సంఘం నాయకులు, బ్రాహ్మణ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రసిడెంట్ కొలవి అనిల్ కుమార్, అశోక్, కోవూరి జగన్, ఆర్ యుగంధర్, జోషి క్రాంతి కుమార్ లు పాల్గొన్నారు.