సౌన గ్రామంలో అన్న భాహు సాఠే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, గ్రామస్తులు
చిత్రం న్యూస్ భైంసా: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో అన్న భాహు సాఠే 105 వ జయంతి మాదిగ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు గాయక్వాడ్ గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్న బాహు సాఠే ఒక అణగారిన వర్గంలో జన్మించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి, పోరాడుతు అనేక రచనలు చేసిన కవి అని గుర్తు చేశారు. ప్రపంచంలో తనదైనా శైలిలో ప్రసంఘాలు ఇచ్చి రష్యా, ఇటలీ, ఇంగ్లాండ్, లాంటి దేశంలో గుర్తింపు తెచ్చుకున్న, ముంబై కోసం గుజరాత్ ప్రభుత్వంతో పోరాడిన సామాజిక వ్యక్తిగా, బడుగు బలహీన వర్గాల కోసం అనేక ఉద్యమాలు చేసి డాక్టర్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన వ్యక్తి అన్న భాహు సాఠే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్తాపకులు నామత్కర్ దిగంబర్ ఎమ్మార్పీఎస్, జిల్లా నాయకులు షెల్కె ఆనంద్, బాబు సర్పంచ్, గణపతి సర్పంచ్, విట్టల్ పటేల్, శ్యామరావు పటేల్, మాదిగ సమాజం పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.