సాత్నాలలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, సాత్నాల: ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం సాత్నాల మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే పాయాల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆయన సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ..బీజేపీ కార్యకర్తలకు వేదికగా నూతనంగా ఏర్పడిన మండలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఆదరించారో అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీని ఆదరించాలని కోరారు. కార్యకర్తలు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి, జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, బోరజ్ మండల అధ్యక్షుడు గాజుల సన్నీ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అస్తక్ సుభాష్, పెరుక సంఘం జిల్లా అధ్యక్షుడు దోడ అశోక్, నాయకులు రమేష్, ఆనంద్, సురేష్, పంద్ర రాము, రాథోడ్ రోహిదాస్, కుంచాల మహేందర్, సంతోష్, తిరుపతి, రేణుక బాయి, అంబరావ్, వెంకటి, రాము, సంతోష్, వసంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు