Chitram news
Newspaper Banner
Date of Publish : 09 August 2025, 12:02 pm Editor : Chitram news

జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు

జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు

*యువత కొత్త ఆలోచనలతో, ఆవిష్కరణలతో ముందుకు సాగాలి

*యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్

చిత్రం న్యూస్, జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా, సమ సమాజ స్థాపనకు నిత్యం కృషి చేసిన సమత మరియు ఐక్యత మూర్తి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి యువజన కాంగ్రెస్ నాయకురాలు రాఖీ కట్టారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..మన దేశంలోనే యువత నాయకత్వం వహిస్తున్న, అత్యంత బలమైన ఆర్గనైజేషన్ గా యువజన కాంగ్రెస్ ముందు వరుసలో ఉందనీ, యూత్ కాంగ్రెస్ ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా సబ్బండ వర్గాల యువత దేశం నలుమూలల నుండి కోట్లాదిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో భాగస్వాములు కావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, యువజన కాంగ్రెస్ ముఖ్య భూమిక పోషించిందని కొనియాడారు. యువజన కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిదని యువతతోనే ఏదైనా సాధ్యమవుతుందని, ఈ దేశ దశ దిశను మార్చేది యువతే నన్న గట్టి సంకల్పంతో యువతలో ఉత్సాహాన్ని నింపుతూ, యువతలో మరింత రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడం కోసం రాహుల్ గాంధీ  ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రజలందరి ఆశీర్వాదాలతో దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డే సంధ్యా నవీన్, పర్లపెల్లి నాగరాజు, జిల్లా కార్యదర్శి సజ్జు, తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, ఫిషర్మెన్ కాంగ్రెస్ పింగిలి రాకేష్, హుజురాబాద్ నియోజకవర్గ కార్యదర్శి రోమాల రాజ్ కుమార్, జమ్మికుంట మండలం ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి వెంకటేష్, యువజన నాయకులు పాతకాల ప్రవీణ్, సురేష్, జావిద్, సతీష్, బషీర్, వెంకటేష్, అశోక్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.