ఎమ్మెల్యే రామారావు పటేల్ కు రాఖీ కడుతున్న సోదరి శాంతాబాయి
చిత్రం న్యూస్, భైంసా: ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ నివాసం లో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సోదరి శాంతాబాయి అన్నకు రాఖీ కట్టి ఆశీర్వచనాన్ని అందించారు. ఎమ్మెల్యే తో పాటు అతని ఇద్దరు సోదరులు భీమ్ రావ్ పటేల్, దత్తారం పటేల్, కుమారులు, కూతుళ్లు, మనుమలు, మనవరాలతో పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. అక్క తమ్ముడు, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రక్షాబంధన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని, రక్త సంబంధాలు మరింత బలపడాలని, మన హిందూ సంప్రదాయంలో పండగలు ఉన్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.