దన్నూర్(బి)లో సామూహిక రక్షాబంధన్ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు
చిత్రం న్యూస్,బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం దన్నూర్ (బి) పద్మశాలి సంఘ భవనంలో సామూహిక రక్షాబంధన్ నిర్వహించారు. కుల దైవము శ్రీ భక్త మార్కండేయ చిత్రపటానికి పూజలు నిర్వహించి సామూహికంగా పద్మశాలి కుల బాంధవులు రక్షాబంధన్ కట్టుకున్నారు. కార్యక్రమంలో బోథ్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆసాల సదాశివ్, పట్టణ అధ్యక్షుడు సంతోష్, శంకర్, రాజేశ్వర్, నారాయణ, ఎర్రన్న, శ్రీనివాస్, సురేష్, రమేష్, గంగారాం, రాంబత్తుల రాజేశ్వర్, లక్ష్మణ్, కుల బాంధవులు పాల్గొన్నారు.

