Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

మూడున్న‌రేళ్లుగా కొన‌సాగుతున్న నిత్యాన్న‌దానం 

స్వ‌యంగా వ‌డ్డ‌న చేస్తున్న కంది శ్రీ‌నివాస రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో గ‌త మూడున్న‌రేళ్ళుగా నిరంత‌రాయంగా కొన సాగుతున్న నిత్యాన్నదాన కేంద్రాన్ని కంది శ్రీ‌నివాస రెడ్డి శుక్ర‌వారం సంద‌ర్శించారు. కేంద్రానికి ఆక‌లి తీర్చుకోవ‌డానికి వ‌చ్చిన అంద‌రికి న‌మ‌స్క‌రిస్తూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఎలా ఉన్నారంటూ వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భోజ‌నం, తాగునీటి సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. వ‌చ్చిన వారికి ఆయ‌న స్వ‌యంగా వ‌డ్డ‌న చేస్తూ క‌డుపు నిండా భోజ‌నం చేయాల‌ని కోరారు.చిన్నారుల‌కు త‌న చేత్తో క‌లిపి తినిపించారు. కంది శ్రీ‌నివాస రెడ్డి చేస్తున్న నిత్యాన్న దానంతో పాటు సామాజిక సేవ‌ల‌ను అంద‌రు ప్ర‌శంసించారు.పేద‌ల ఆక‌లి తీర్చ‌డం భ‌గ‌వంతుడు త‌న‌కు క‌ల్పించిన అదృష్ట‌మ‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు.త‌రుచుగా వ‌చ్చేవారితో పాటు ఆదిలాబాద్ కు చుట్టుప‌క్క‌ల గ్రామాల వారు ఏ ప‌ని మీద వ‌చ్చినా మ‌ధ్యాహ్నం వేళ అన్న‌దాన కేంద్రంలో భోజ‌నం చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. తాను గెలిచినా ఓడినా నిత్యాన్నదానం మాత్రం కొన‌సాగుతుంద‌న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments