ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభకు రావాలని టీపీసీసీ నేత ఆత్రం సుగుణకు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న రాయ్ సెంటర్ పెద్దలు
చిత్రం న్యూస్, ఉట్నూర్: ఈ నెల 9వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ఘనంగా నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణను గౌరవ ఆతిథిగా రావాలని గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ పెద్దలు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ ప్రతినిధులు ఆమెను ఉట్నూర్ మండల కేంద్రంలో కలిసి ,ఈ సభ ముఖ్య ఉద్దేశ్యాలు, ఆదివాసీ హక్కులపై చర్చించారు. ఆదివాసి గూడాల అభివృద్ధి కోసం ఆత్రం సుగుణ చేస్తున్న నిరంతర కృషిని కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఆత్రం సుగుణ మాట్లాడుతూ..ఆదివాసుల హక్కులు, వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆదివాసీల హక్కులు, భూసమస్యలు, యువత భవిష్యత్తు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ జిల్లా సార్ మెడీ మెస్రం దుర్గు,తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పెందోర్ దాది రావ్,మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం బుజంగరావు,మర్సు కొల తిరుపతి-సరస్వతి, సిడం గంగాధర్,పూర్కా బాపురావ్,గేడం మారుతీ,కొట్నాక్ గణపతి, ఆత్రం రాహుల్,కొట్నాక్ ఒమేశ్వర్, ఆడ హన్మంత్, రాధ బాయి, విమల బాయి,వెట్టి పార్వతి బాయి,అన్నపూర్ణ, కనక వెంకటేశ్వర్ రావ్, తొడసం భగవంత్ రావ్, కనక సంతోష్, కొలం గంగారాం,దుందే రావ్, సునీల్, తదితరులు పాల్గొన్నార