భైంసా సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అజ్మీరా సాంకేత్ కుమార్
*బాసర అమ్మవారి దర్శనాంతరం బాధ్యతల స్వీకరణ
*స్వాగతం పలికిన రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది
చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా సబ్ కలెక్టర్ గా అజ్మీరా సాంకేత్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన మార్గ మధ్యంలో బాసర అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అక్కడి నుంచి నేరుగా భైంసాలోని కార్యాలయానికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఆర్డీవో కోమల్ రెడ్డి, భైంసా తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ లు, అర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల అధికారులు, సిబ్బంది, సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో అర్డీవో కోమల్ రెడ్డి నుంచి సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అజ్మీరా సాంకేత్ కుమార్ కు నియోజక వర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతి నిధులు మర్యాద పూర్వకంగా కలిశారు.