డబ్బా పాలు వద్దు.. తల్లిపాలు ముద్దు
అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు చిత్రం న్యూస్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు జరిపారు. ఈ సమావేశాల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత తల్లిపాల ప్రాధాన్యతను తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వం పేద మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే అపోహాలను వీడి తల్లిపాలు త్రాగించాలని కోరారు. తల్లిపాల వలన బిడ్డ ఆయుష్షును పెంచిన...