Chitram news
Newspaper Banner
Date of Publish : 06 August 2025, 10:45 am Editor : Chitram news

డబ్బా పాలు వద్దు.. తల్లిపాలు ముద్దు

అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు

చిత్రం న్యూస్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు  సామూహిక శ్రీమంతాలు జరిపారు. ఈ సమావేశాల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత తల్లిపాల ప్రాధాన్యతను తెలియజేశారు.  ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వం పేద మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే అపోహాలను వీడి తల్లిపాలు త్రాగించాలని కోరారు. తల్లిపాల వలన బిడ్డ ఆయుష్షును పెంచిన వారవుతారని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. డబ్బా పాలు వద్దు… తల్లిపాలేముద్దని తెలియజేశారు. అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. గర్భిణీలు ప్రసవ సమయంలో సిజేరియన్ల వైపు వెళ్లకుండా సాధారణ కానుపు చేయించుకుంటే మంచిదని సూచించారు. ఆయా గ్రామాలలోని గర్భిణులకు శ్రీమంతాలు చేసి, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నరసవ్వ, పంచశీల, దేవలత, ఏఎన్ఎంలు జయ,రాజ కళ, ఆశ వర్కర్లు నర్మద, సంజన, గర్భిణీలు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.