అట్టహాసంగా క్రీడా పోటీలు ప్రారంభం
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ కిసాన్ గల్లి పాఠశాలలో స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..విద్యా రంగములో క్రమశిక్షణ, భారతీయ సంస్కృతిని రక్షించడములో శ్రీ సరస్వతీ విద్యాపీఠం మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు.శ్రీ సరస్వతీ విద్యాపీఠం అధ్యక్షులు తక్కళ్ల పల్లి తిరుపతి రావు మాట్లాడుతూ.. శరీర మాద్యమంఖలు, ధర్మ సాధనం మనము ఏమీ సాధించాలన్న మన శరీరము ఆరోగ్యం గా ఉండాలన్నారు.శరీరము ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యముగా ఉంటుందన్నారు .ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. ఒత్తిడి అంతా దూరం అవుతుందన్నారు. ఈ పోటీలు పాఠశాల స్థాయి నుండి ప్రారంభమై జిల్లా, రాష్ట్ర, క్షేత్ర, జాతీయ స్థాయిలకు విస్తరిస్తాయాన్నారు. ఈ క్రీడలలో మొదటి స్థానంలో నిలిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి శ్రీ సరస్వతి విద్యాపీఠం సంఘటన కార్యదర్శి పీ.శ్రీనివాస్ రావు,శైక్షణిక ప్రముఖ్ కృష్ణమాచార్యులు, క్షేత్ర సంగీత ప్రముఖ్ మెట్టొల్ల సాయినాథ్, విభాగ్ శైక్షణిక ప్రముఖులు, మూడు పాఠశాలల ప్రధానాచార్యులు పాల్గొన్నారు.

