రక్తదానం చేస్తున్న ఆలయ అర్చకుడు గుడిపాటి రామాంజనేయులు
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదినం సందర్బంగా జైనథ్ మండలం లోని కూర గ్రామంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు గుడిపాటి రామాంజనేయులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. కూర గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు అర్చకునికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు సిడం రాకేష్ , యువ నాయకులు సాయిప్రసాద్, సూర్య రెడ్డి, సాయి కుమార్, బిట్టులు పాల్గొన్నారు.
