Chitram news
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 8:10 am Editor : Chitram news

ఘనంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే  పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు

రక్తదానం చేసిన బీజేపీ కార్యకర్తలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పేదల పెన్నిధి, అలుపెరగని నాయకుడు, రైతు బాంధవుడు,  రాజకీయ దురంధరుడు, స్థిత ప్రజ్ఞుడు, నిత్య కృషీవలుడు,  ప్రజా సేవకుడు, అన్న అని పిలిస్తే  వెన్నంటే ఉంటూ ప్రజల శ్రేయస్సుకు పరితపించే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా టైగర్, జైనథ్ మండలంలోని అడ గ్రామ నివాసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలను బీజేపీ శ్రేణులు నడుమ ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ కేకు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  బీజేపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి రక్తదానం చేశారు. జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో  ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా జైనథ్ మండల శ్రేణులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకున్నారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకుడు చిలుకూరి లింగారెడ్డి ఆధ్వర్యంలో  గ్రామంలో పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సామ రమేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నారకట్ల ప్రతాప్ యాదవ్, గౌకర్ విశాల్,  యువ మోర్చా మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నారకట్ల ప్రతాప్ యాదవ్, గౌకర్ విశాల్, యువ నాయకుడు ఏనుగు సూర్య రెడ్డి, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.