గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సుతో నాయకులు, గ్రామస్తులు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మంగ్రూడ్, పాటన్, కొబ్బయితో పాటు పలు గ్రామాల విద్యార్థులు జైనథ్ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ దృష్టికి తీసుకెళ్లారు, ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించడంతో శుక్రవారం గ్రామాలకు బస్సు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జనరల్ సెక్రటరీ సందీప్ టాక్రే, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.