ఉష్కేల దశరథ్
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు శనివారం ఎస్సై శ్రీ సాయి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..బోథ్ కు చెందిన ఉష్కేల దశరథ్ (30) తన భార్య శైలజ, కుమార్తెతో కలిసి నిర్మల్ లో నివాసం ఉంటున్నారు. భార్య అనారోగ్యం కారణంగా గత 2 వారాల క్రితం బోథ్ కు రాగా భార్య తన పుట్టింటికి నేరడిగొండ వెళ్ళింది. దశరథ్ జులై 31 న నిర్మల్ వెళ్తానని చెప్పి ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో అతని భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ,ఆచూకీ తెలిస్తే 87126 59932 ను సంప్రదించాలని ఎస్సై పేర్కొన్నారు.