ఆటో దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న యూనియన్ నాయకులు
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణ కేంద్రంలోనీ బస్టాండ్ లో గల ఆటో స్టాండ్ వద్ద ఆటో దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోథ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. పగలు, రాత్రి అని తేడా తెలియక ప్రజల కష్టాల్లో ఆటో డ్రైవర్లు స్పూర్తి ఎనలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్ లు పాల్గొన్నారు.