Chitram news
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 2:54 pm Editor : Chitram news

క్షేత్ర పర్యటనకు విద్యార్థులు

విద్యార్థులకు వివరిస్తున్న ఉపాధ్యాయులు

చిత్రం న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని సెయింట్ థామస్ పాఠశాల విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటనకు వావిలాల గ్రామానికి వెళ్ళారు. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టానము సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టు పురుగు కాటన్ నుండి దారం ఎలా తయారవుతుందో తెలుసుకున్నారు . తర్వాత లావు దారం నుండి సన్నధారం ఎలా వస్తుందో చూపించారు. దారాలకు రంగులు ఎలా వేస్తారో సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ & ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు అవగాహన కల్పించడానికి క్షేత్ర పర్యటన చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.