అన్న బాహు సాటే విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తన రచనలతో సమాజాభివృద్ధికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి, సాహితీవేత్త అన్న బాహు సాటే అని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు శుక్రవారం అన్న బాహు సాటే జయంతి సందర్భంగా ఆదిలాబాద్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్న బాహు సాటే జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.. అనంతరం మాంగ్ సమాజ్ సభ్యులు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించగా.. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు
