*నాగుల నరేష్ ఛాతీపై పాయల్ శంకరన్న ఎమ్మెల్యే అని పచ్చబొట్టు
*అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదినం సందర్భంగా రూ.1.50 లక్షలు సొంత ఖర్చుతో 2 కిలో మీటర్ల మేర ఫ్లెక్సీలు ఏర్పాటు
*పెండల్వాడకు చెందిన నాగుల నరేష్ పెల్లుబికిన అభిమానం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన నాగుల నరేష్ కు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటే గుండె నిండా అభిమానం. ఎలాగంటారా.. ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాగుల నరేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ లో చేరారు. అప్పుడు పాయల్ శంకర్ అన్న ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే కాక మునుపు తన ఛాతీపై పచ్చబొట్టు పొడిపించుకొని తన గుండె నిండా అభిమానాన్ని చాటాడు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాగుల నరేష్ తన అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదినం సందర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండలం బాలాజీ గార్డెన్ నుంచి ఠాకూర్ హోటల్ వరకు జన్మదిన ఫ్లెక్సీలను రూ.1.50 లక్షల వరకు సొంత ఖర్చులతో ఏర్పాటుచేసి తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. దారిపొడవునా వచ్చే వారంతా బీజేపీ యువ నాయకుడు నాగుల నరేష్ ది గుండె నిండా అభిమానం అంటూ ప్రజలు చర్చించుకుంటన్నారు.

