ఘనంగా ఎంఈఓ కోల నరసింహులుకు సన్మానం
బేలలో ఎంఈఓ కోల నరసింహులు దంపతులను సన్మానిస్తున్న చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాధికారిగా కోల నర్సింహులు ఉద్యోగ విరమణ పొందారు. గురువారం బేల మండల కేంద్రంలోని గణేష్ గార్డెన్లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి హాజరై ఆయన్ను ఘనంగా సన్మానించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తహసిల్దార్ రఘునాథ్...