Chitram news
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 1:30 pm Editor : Chitram news

పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ 

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈఓ శ్రీనివాసరెడ్డి

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పలు పాఠశాలలను గురువారం జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిర్సన్న ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి.. వారి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు.. పబ్లిక్ పరీక్షలకు ఇప్పటి నుంచి పట్టుదలతో చదవాలని సూచించారు. అనంతరం బేల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు  పాఠశాల కొనసాగుతున్న ఏఐ తరగతులను పరిశీలించి కార్యక్రమ నిర్వాణపై ఆరా తీశారు.ముఖ గుర్తింపు హాజరు నమోదుపై అరా తీశారు. అనంతరం ఉర్దూ పాఠశాల సందర్శించి సమస్యలపై అరా తీశారు. అక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందని పోషకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన డీఈఓ సాయంత్రం వేరే పాఠశాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహాలక్ష్మి, సదానంద్ కు పలు సూచనలు చేశారు.