Chitram news
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 11:54 am Editor : Chitram news

అర్హులైన పేదలకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కృషి :ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

పంచాయతీ భవనానికి భూమిపూజ చేస్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి

చిత్రం న్యూస్, జైనథ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రాష్ట్ర నిధులతో ఇల్లు లేనటువంటి పేదవారందరికీ ఇల్లు అందజేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం జైనథ్ మండలంలోని జైనథ్, బెల్గాం గ్రామాలలో డిసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేసి, నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..ప్రభుత్వ పథకాలు ఏవి వచ్చినా అర్హులైన వారికి అందే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. నియోజకవర్గంలోని లబ్ధిదారులు ఎవరు కూడా మధ్యవర్తులను నమ్మవద్దని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి తక్కువ ధరకే సిమెంట్ లభించే విధంగా కంపెనీలతో మాట్లాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, బీజేపి అదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్,మాజీ బీజేపి మండల అద్యక్షుడు కట్కం రాందాస్, బీజేపి మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఎల్టీ అశోక్ రెడ్డి, సామ రమేష్ రెడ్డి, తిపిరెడ్డి రాకేష్ రెడ్డి,సూర్య రెడ్డి, ప్రతాప్ యాదవ్, సామ రమేష్ రెడ్డి, విశాల్, కుమ్ర బాజీరావ్, అశోక్,సురేష్ రెడ్డి, పోశాలు తదితరులు పాల్గొన్నారు.