*ఆయిల్ పామ్ సాగుకు తక్కువ నీరు అవసరం
చిత్రం న్యూస్, భైంసా: తెలంగాణలో అయిల్ పామ్ సాగు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ వానాకాలం ఆరంభమైన నేపథ్యంలో వివిధ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్ పామ్ సాగువైపు మళ్లించేందుకు అవగాహన కలిపిస్తుంది.ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన శాఖ, ప్రీయునిక్ ఆయిల్ పామ్ కంపెనీ సంయుక్తంగా గురువారం కామోల్ రైతు వేదికలో భైంసా ఉద్యాన శాఖ జావేద్ పాషా,ఏఈవో రాజు,ప్రీయునిక్ కంపెనీ శేఖర్, శివాజీ,పాల్గొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయిల్ పామ్ సాగు కోసం రైతుకి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ లో మొక్కలు అలాగే డ్రిప్ పరికరాలు, పంట సాగు విధి విధానాలు ఉద్యానశాఖ జావేద్ పాషా, వివరించారు. ఏఈవో రాజు మాట్లాడుతూ..ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు వస్తున్నాయని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నార న్నారు. ఈ సాగుతో తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని, అంతర పంటలు కూడా వేసుకోవచ్చని,ప్రభుత్వం కూడా ఈ సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. ఆయిల్ పామ్ సాగు 40 సంవత్సరాల వరకు ఉంటుందన్నారు.ప్రతి సంవత్సరం ఎకరానికి రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుందన్నారు.నీటి ఆదా ఆయిల్ పామ్ సాగుకు తక్కువ నీరు అవసరం, ఇది నీటి కొరత ఉన్న ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందన్నారు.ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలు కూడా వేసుకోవచ్చు, దీని ద్వారా అదనపు ఆదాయం పొందవఛారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోందని, రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతులను ఈ సాగుకు ప్రోత్సహిస్తోందన్నారు.ఈ కార్యక్రమం అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
