ఏఈవో రాజు
చిత్రం న్యూస్, భైంసా: ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించడానికి శుక్రవారం కామోల్ రైతు వేదిక లో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏఈవో రాజు తెలిపారు. ఈ సదస్సులో ఆయిల్ పామ్ పంట సాగు, యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్యం, మార్కెటింగ్, ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి వివరిస్తామన్నారు. రైతులకు ఆయిల్ పామ్ సాగులో మెలకువలు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం అవగాహన కల్పిఇస్తామన్నారు. భవిష్యత్తులో ఆయిల్ పామ్ సాగు ఒక మంచి ఆదాయ వనరుగా ఉంటుందని, రైతులు ఈ పంటను సాగు చేయడానికి ముందుకు రావాలని ఏఈవో రాజు సూచించారు.

