Chitram news
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 3:21 pm Editor : Chitram news

జిల్లా  ఎస్పీని కలిసిన బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను సన్నానిస్తున్న బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా డీపీవో కార్యాలయంలో  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ని బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్, నడికుంట ప్రవీణ్ తో కలిసి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. నూతన మండలం సొనాలలో తొందరగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయ్యేలా కృషి చేయాలని విన్నవించారు. మండల పరిధిలో సివిల్, మినల్ కేసులు ఎక్కువగా నమోదు కావడం, మహారాష్ట్ర సరిహద్దుల్లో మండలం ఉండడం వలన గుర్తు తెలియని వ్యక్తులతో మండల ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పదుతున్నాయని వివరించారు. వీటి నివారణకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు తప్పనిసరిగా మారిందని విన్నవించగా ఎస్పీ అఖిల్ మహాజన్ వీలైనంత తొందరలో అయ్యేలా కృషి చేస్తానని చెప్పారని తెలిపారు.  ఎస్పీ మాట్లాడుతూ యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా మారి సమాజానికి సేవ చేయాలని, యువకులు ఉన్నత స్థానాలకు ఎదిగి తమ గ్రామాల పేరును, కీర్తి ని పతాక స్థాయికి చేర్చాలని, చెడు వ్యసనాల బారిన పడకుండా సన్మార్గం వైపు పయనించాలన్నారు.