మహిళలతో మాట్లాడుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్
చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని ఎన్టీఆర్ అపార్ట్మెంట్లో నెలకొన్న వాటర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు పెద్ద ఎత్తున మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ స్వగృహంకు వెళ్ళి సమస్యను తెలియజేశారు. గత మూడు రోజులుగా వాటర్ ట్యాంకు ద్వారా మంచినీటిని పంపిస్తున్న దాహార్తితో ప్రజలు అల్లాడుతున్నారని మహిళలు వాపోయారు. మున్సిపల్ యంత్రాంగం దృష్టికి తీసుకొని వెళ్లి త్రాగునీరు సమస్యపై బోర్ వెల్ వేసేలాగ చర్యలు తీసుకుంటామని నెక్కంటి సాయిప్రసాద్ మహిళలకు హామీ ఇచ్చారు.
