తీజ్ పండగలో మహిళలు, యువతులు
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం బాబేర తండాలో ఘనంగా తీజ్ పండుగ నిర్వహించారు. బంజారా సంస్కృతిలో బంజారా తెగలో తీజ్ పండుగను మొలకల పండుగ అని కూడా పిలుస్తారు. ఇది వారి సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. వివాహిత స్త్రీలు భర్త కోసం, పెళ్లికానిజ్ అమ్మాయిలు తమ కాబోయే భర్త దీర్ఘాయువు కోసం పూజలు చేశారు. తమ భర్తల శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉండి ప్రార్థించారు. వర్షాకాలం రాకను స్వాగతిస్తూ ఈ పండగను జరుపుకుంటారు. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలు, ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి, సాంప్రదాయ ఆభరణాలను ధరించి సందడి చేస్తారు. ఊయల ఊగుతూ.. జానపద పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.