Chitram news
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 2:26 pm Editor : Chitram news

ఆదివాసుల సంక్షేమానికి ప్రత్యేక కృషి- పాయల్ శంకర్ 

చప్రాలలో  శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే  పాయల్ శంకర్ 

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామంలో జన్ మన్ పథకం కింద రూ.2.30 కోట్ల  నిధుల వ్యయంతో నిర్మించనున్న బాలుర హాస్టల్ బిల్డింగ్ నిర్మాణ పనులకు మంగళవారం భూమి పూజ చేసి శిలా ఫలకం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ..ఆదివాసుల అభివృద్ధికి కేంద్రం జన్ మన్ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. జన్ మన్ నిధుల ద్వారా ఆదివాసి గ్రామాల నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే ముఖ్య లక్ష్యం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ  వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు వందల కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తయి ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో  బీజేపీ నాయకులు పాల్గొన్నారు.