పోరాటాలకు సంబంధించి కరపత్రాలు విడుదల చేస్తున్న ఎంఇఓ కోల నరసింహులు, ప్రధానోపాధ్యాయుడు జాడి సుదర్శన్
చిత్రం న్యూస్, బేల: పాఠశాల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యూఎస్పీసీ) ఆధ్వర్యంలో దశలవారీగా పోరాట కార్యక్రమాలు చేపడుతున్నట్టు టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు అశోక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి కోల నరసింహులు, ప్రధానోపాధ్యాయులు జాడి సుదర్శన్ చేతుల మీదుగా పోరాటాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఆగస్టు 1న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. కార్యక్రమంలో సంఘం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
