హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్న నియోజకవర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్
చిత్రం న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా హుజురాబాద్,మండలం వీణవంక, ఇల్లందకుంట,కమలాపూర్ మండలాల లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు లతో కలిసి నియోజకవర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు, సబ్సిడీ గ్యాస్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నూతన రేషన్ కార్డులు ఇలా అనేక కార్య క్రమాలు చేపడుతూ..ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధిలో ముందుకు వెళుతున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
