సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన
సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల గురించి హెల్త్ అసిస్టెంట్లు రాథోడ్ కైలాష్, సుభాష్ కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని, దానిలో...