Chitram news
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 2:30 am Editor : Chitram news

ఎస్సీ హాస్టల్ ను సందర్శించిన సామాజిక సమరసత ఖమ్మం జిల్లా హాస్టల్ విద్యార్థి కన్వీనర్ నవీన్

ఎస్సీ హాస్టల్ లో మాట్లాడుతున్న సామాజిక సమరసత ఖమ్మం జిల్లా హాస్టల్ విద్యార్థి కన్వీనర్ నవీన్

చిత్రం న్యూస్, ఖమ్మం: ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సామాజిక సమరసత ఖమ్మం జిల్లా హాస్టల్ విద్యార్థి కన్వీనర్ నవీన్ సందర్శించారు.  విద్యార్థులతో సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత విద్యార్థి కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర్, అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్, వివేకానంద మొదలగు మహాపురుషుల జీవిత చరిత్రల గురించి విద్యార్థులకు వివరించారు. వారిని ఆదర్శంగా తీసుకుని మన విద్య ఈ దేశ బాగు కోసం ఉపయోగపడాలన్నారు.  ఉన్నత విద్యావంతులుగా ఎదిగితే గౌరవం సహజంగానే లభిస్తుందని అని అన్నారు. ఈ దేశ భవిష్యత్తు అన్ని కులాల మీద ఆధార పడిందని, దేశం అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే అందరం కలిసి కట్టుగా పనిచేయాలని అన్నారు. అంబేద్కర్ ఎదుర్కున్న వివక్షత కష్టాలు మనకు లేవని ఒకవేళ ఎదురైనా అంబేద్కర్ వలె నిర్మాణాత్మకంగా ఆలోచించి విద్య ద్వారా మార్పును తీసుకుని రావాలన్నారు.  సమాజాన్ని విడగొట్టే పని ఎక్కడ చేయకూడదని ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అనే భావన మన మనసులో నుండి చెరిపివేయాలన్నారు. ఈ దేశ అభివృద్ధిలో అన్ని కులాల పాత్ర ఉందని మరిచిపోవద్దని సైంటిస్టుల నుండి క్రీడాకారుల రంగం వరకు ఏది తీసుకున్న వివిధ కులాలకు చెందిన వారు ఉన్నారని, కేవలం దేశ సేవ మాత్రమే ప్రథమం అనే విధంగా ముందుగు సాగుతూ చరిత్ర సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత ఖమ్మం నగర కన్వీనర్ నూకల మోహన కృష్ణ , సామాజిక సమరసత సంగారెడ్డి జిల్లా సేవా బస్తీ కన్వీనర్ ఎన్.భోజరాజు పాల్గొన్నారు