Chitram news
Newspaper Banner
Date of Publish : 28 July 2025, 3:25 pm Editor : Chitram news

బోథ్ ఆదర్శ పాఠశాలలో బోధించుటకు ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

 బోథ్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్. జిల్లా బోథ్ ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల మాధ్యంలో  బోధించుటకై ఖాళీ పోస్టులకు గంటల ప్రతిపాదనకు పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు ఒకటవ తేదీలోపు  పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. ఈ పోస్టుకు M.A. B. Ed తోపాటు TET క్వాలిఫై అయి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు ఒరిజినల్ ధ్రువపత్రాలు, జిరాక్స్ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వేతనం గరిష్టంగా 18,200 ఉంటుందని తెలిపారు.

ఆదర్శ పాఠశాలలో తక్షణ ప్రవేశాలకు ఆహ్వానం..

బోథ్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాల లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం C. E. C గ్రూప్, M. E. C గ్రూప్ లో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు 7వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించి,  భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  వివరాలకు ఈ క్రింది నెంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు 9666525131,8374361232