తెలంగాణ విద్యార్థి పరిషత్ 13వ ఆవిర్భావ పోస్టర్ల ను విడుదల చేస్తున్న విద్యార్థులు
చిత్రం న్యూస్, బోథ్: తెలంగాణ విద్యార్థి పరిషత్ 13వ ఆవిర్భావ దినోత్సవ గోడ పత్రులను బోథ్ నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థులతో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ కో కన్వీనర్ సతీష్ మాట్లాడుతూ..తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ విద్యార్థులకు అండగా నిలుస్తూ అనతి కాలంలోనే ప్రశ్నించే గొంతుకగా పేరు సంపాదించిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏకైక జెండాగా పనిచేస్తుందని, టీజీవిపి పోరాట ఫలితంగానే విద్యార్థుల సమస్యలు పరిష్కరించబడ్డాయని, ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం నిరంతర పోరాటం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా విద్యారంగ సమస్యలపై సామాజిక సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదైనా సరే విద్యార్థుల పక్షాన పోరాటం చేయడమే మా విధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాము, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

