మాదిగ ఉప కులాల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
చిత్రం న్యూస్, బేల: మాదిగ ఉప కులాల సమస్యల గురించి వినతి పత్రాలు ఇవ్వాలన్న రాష్ట్ర పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదరపుప్రవీణ్ మాదిగ, జిల్లా అధ్యక్షులు సుంకే రమేష్ మాదిగ ఇతర నాయకులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదిగలకు అంబేద్కర్ అభయాసం పథకం ద్వారా రూ.12 లక్షల ఇవ్వాలని, దళితుల భూములను ఆక్రమించిన వారి భూములను వాళ్ళకి ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లో నిజమైన అర్హులకు ఎస్సీ, ఎస్టీ పేదలకు రూ.10 లక్షల వరకు ఇవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఇండస్ట్రీలలో లోన్ తీసుకున్న దళితులకు సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశామని వినతి పత్రంలో పేర్కొన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నడుకుంటి పెంటన్న మాదిగ, జిల్లా కార్యదర్శి సుద్దాల రాజు, శ్రీకర్ మల్యాల, గంగన్న, ఆశన్న, తదితరులు పాల్గొన్నారు. 3
