Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆటల పండగ వాతావరణం 

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆటల పండగ వాతావరణం

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో  మంగళవారం నుండి మూడు రోజులపాటు ప్రాంతీయ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి 450 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ఈ క్రీడాకారులు అందరూ వారి వారి నవోదయ విద్యాలయాల్లో నుండి ఎంపిక చేయబడి పెద్దాపురం నవోదయ విద్యాలయంలో జరగబోతున్న ప్రాంతీయ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారు. ఈ రీజనల్ కబడ్డీ మీట్ ప్రారంభోత్సవం స్థానిక పారిశ్రామికవేత్త మట్టే శ్రీను బాబు, మట్టే ప్రసాద్ బాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.  ఈ నెల 29 న మంగళవారం ఉదయం 9 గంటలకు క్రీడా జ్వాల, క్రీడా ర్యాలీ, శాంతికపోత ఎగురువేత, బాణసంచా ఇతర కార్యక్రమాలతో ఈ పోటీలు ప్రారంభం కాబోతున్నాయని ఆ విద్యాలయ ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి తెలియజేశారు. ఈ ప్రాంతీయ కబడ్డీ పోటీలు పాల్గొనే నిమిత్తం ఎనిమిది క్లస్టర్లు అనగా కృష్ణ క్లస్టర్,ఖమ్మం క్లస్టర్, బీదర్ క్లస్టర్ షిమోగా క్లస్టర్, కడప క్లస్టర్, వైయనాడు క్లస్టర్, తుమకూరు క్లస్టర్ నుండి అండర్ 14, 17 అండర్ 19 బాయ్స్ , గర్ల్స్ కేటగిరిలో వేర్వేరుగా ఈ పోటీలు జరగనున్నాయని ఆ విద్యాలయ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఆర్ సత్యనారాయణ, పి.అనురాధ తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments