విద్యార్థినికి బ్యాగు అందజేస్తున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి
చిత్రం న్యూస్, జైనథ్ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ తో పాటు అంగన్వాడీ పిల్లలకు పలకలు పంపిణి చేసి ఉదారత చాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, హైస్కూల్ ప్రాథనోపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు సుప్రియ, సరిత, ,గ్రామస్తులు నారాయణ, గంగమ్మ, మనోజ్, అశోక్, విట్టల్ గన్నోజీ, నారాయణ, దేవమ్మ, భగత్ భూమారెడ్డి, ఆశన్నయాదవ్ తదితరులు ఉన్నారు.
వీల్ చైర్ అందజేత
ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హోసింగ్ బోర్డు కాలనికి చెందిన ఎల్టి.దేవారెడ్డి కుమారుడు దివ్యాంగుడు ప్రణీత్ కు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి వీల్ చైర్ అందజేశారు. ప్రణీత్ ను పాఠశాల కి తీసుకువెళ్ళడానికి తల్లి తండ్రులకి ఇబ్బందిగా మారిందని కాలనీ వాసుల ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే స్పంధించి అతనికి వీల్ చైర్ అందజేసి ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత చాటుకున్నాడు. ఆయన వెంట నారాయణరెడ్డి,మోరేష్, రమణ, విట్టల్ రెడ్డి, హరినివాస్ రెడ్డి, విపుల్ రెడ్డి,సురేందర్ రెడ్డి, ఆశన్నాయాదవ్, దినేష్ రెడ్డి, ప్రణీష్ తదితరులు ఉన్నారు.
