సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్, సాత్నాల: సమస్యలు తీర్చమని ఎమ్మెల్యేను కలడానికి వెళ్లిన ప్రజలతో ప్రభుత్వం మనది లేదని మాట్లాడి చేతులు దులుపుకోవడం పరిష్కారం కాదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం సాత్నాల మండలం లో ముందస్తుగా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై వివరించాలన్నారు. ఈ కార్యక్రమం లో సాత్నాల మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదట సీతారామ మందిరంలో జోగు రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల ఫై దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. గత ప్రభుత్వ బీఆర్ఎస్ హయాంలో ప్రతి మరుమూల గ్రామాలకు కోట్ల రూపాయలు వెచ్చించి కమిటీ హాలు, రైతు వేదికలు, గ్రామ రోడ్ల నిర్మాణాలు, తో పాటు స్కూల్లో పునరుద్ధరణ, ఆలయాల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ లు యాసం నర్సింగ్ రావు, మెట్టు ప్రహ్లాద్, నాయకులు దేవన్న, బుచ్చన్న, వేణు యాదవ్, ఉగ్గే విఠల్ తదితరులు పాల్గొన్నారు.

