బీజేపీలో చేరుతున్న వారికి పార్టీ కండువా కప్పుతున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ లో చేరుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జైనథ్ మండలం ఆనంద్ పూర్ లో యువ నాయకుడు విశాల్ ఆధ్వర్యంలో సాత్నాల మండలం సాంగ్వి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణ రాష్ట్రానికి సైతం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. బీజేపీలో పనిచేయడం అంటే దేశ రక్షణ కోసం పనిచేయడం అని పేర్కొన్నారు. యువత బీజేపీలో చేరడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, బీజేవైఎం జైనథ్ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

