రాంటెక్ ఆలయంలో మాజీ మంత్రి జోగురామన్న
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో 12వ శతాబ్దానికి చెందిన అతి పురాతన రాంటెక్ ఆలయాన్ని మాజీ మంత్రి జోగురామన్న సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు భోజనం వడ్డించారు. అతి పురాతన ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. హిందూ ధర్మ ఆలయంగా రాం టెక్ నిర్మాణం ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. శ్రీ రాముడి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. కారింగుల ప్రణయ్ ఉన్నారు.

