Chitram news
Newspaper Banner
Date of Publish : 26 July 2025, 2:53 pm Editor : Chitram news

వజ్జర్ అంగన్వాడీ భవనాన్ని అద్దె భవనంలోకి మార్చండి

( చిత్రం న్యూస్, ఎఫెక్ట్ )

*త్వరలో నూతన భవనం  ఏర్పాటు చేస్తాం

*అంగన్వాడీ  కేంద్రాన్ని సందర్శించిన జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా

చిత్రం న్యూస్, సొనాల:ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని ఆదివాసీ మారుమూల గ్రామం వజ్జర్  అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా శనివారం సందర్శించారు. వజ్జర్  అంగన్వాడీ కేంద్రం పరిస్థితి గోసగా ఉంది. ఈ కేంద్రం ప్రభుత్వ పాత బిల్డింగ్ లో కొనసాగుతుంది.  వర్షం వస్తే అంతే సంగతి. నీరు కారడంతో  అక్కడ ఉండలేని పరిస్థితి. కూర్చుందామంటే కింద  నీళ్లు ఉంటాయి. భవనం శిధిలావస్థకు చేరడంతో పిల్లలు భయాందోళన నడుమ బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారని ఈ నెల 25 న శుక్రవారం వజ్జర్  అంగన్వాడీ కేంద్రంలో  గోస అని ఆర్టికల్  “చిత్రం న్యూస్” లో  పబ్లిష్ అయ్యింది. స్పందించిన ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా 26న  శనివారం సందర్శించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ జంగుబాయిని, అంగన్వాడీ టీచర్  సుశీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని వెంటనే అద్దె భవనంలోకి మార్చాలని సూచించారు. నూతన భవనం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.