అవగాహన సదస్సులో మాట్లాడుతున్న 7 వ అదనపు జిల్లా జడ్జి చంద్రమౌళీశ్వరి
చిత్రం న్యూస్, పెద్దాపురం: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని 7వ అదనపు జిల్లా జడ్జి చంద్రమౌళీశ్వరి అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ లో శనివారం ఉదయం 11 గంటలకు మెప్మా మహిళా గ్రూప్ సభ్యులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 7 వ అదనపు జిల్లా జడ్జి చంద్రమౌళీశ్వరి మాట్లాడారు. మహిళలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి, మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహాలు, ఇతర చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం మండల న్యాయ సేవాధికార సంఘం సర్వీసెస్ కు సంబంధించి మెప్మా మహిళా గ్రూపు నిర్వహిస్తున్న వస్తువు విక్రయాల స్టాల్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్కే వల్లి బాబు, ఇతర బార్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ,పెద్దాపురం సీఐ విజయ శంకర్ ,ఎస్ఐ మౌనిక, మండల న్యాయ సేవాధికారి సంఘం పానెల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు, మెప్మా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
