అమర జవాన్లకు నివాళుర్పిస్తున్న భజరంగ్ దళ్ నాయకులు
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని శివాజీ కూడలి వద్ద కార్గిల్ విజయ్ దివస్ ను భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. అమరులైన జవాన్లకు నాయకులు నివాళుర్పించారు. ఈ సందర్భంగా భజరంగ్ దళ్ మండల అధ్యక్షులు అగార్కర్ ఆకాష్ మాట్లాడుతూ..జులై 26వ తేదీతో కార్గిల్ యుద్దం ముగిసి నేటితో 26 ఏళ్లు పూర్తయిందని అన్నారు. ఈ యుద్ధంలో మృతి చెందిన జవాన్లకు ఘనంగా నివాళులర్పించామన్నారు. దేశ సరిహద్దుల్లో ఉంటూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ ప్రజలకు రక్షణగా ఉంటున్నది జవానులేనని పేర్కొన్నారు. దేశం కోసం సైన్యంలో చేరేందుకు యువత ముందుకు రావాలన్నారు. భజరంగ్ దళ్ మండల ఉపాధ్యక్షులు ముజేందర్ ప్రీతం, రాము బర్కడే, తరుణ్, సచిన్, అనోజ్, కళ్యాణ్, వంశీ, శివ, పవన్ తదితరులు పాల్గొన్నారు.
