Chitram news
Newspaper Banner
Date of Publish : 26 July 2025, 3:23 am Editor : Chitram news

ఉపాధ్యాయుల ఉదారత 

                    ఉపాధ్యాయుల ఉదారత

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దహిగావ్ మరాఠి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు తలో కొంత విరాళం సేకరించి రూ.40 వేల విలువైన ప్రొజెక్టర్ ను కొనుగోలు చేసే ఉదారత చాటుకున్నారు. ఎంఈఓ కోల నరసింహులు దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఇఓ కోల నరసింహులు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. తమ పాఠశాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉపాధ్యాయులు ప్రాజెక్టర్ ను కొనుగోలు చేయడం గొప్ప విషయమన్నారు.  ఉపాధ్యాయులను  నాయకులు, గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూదగిరి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి నితిన్, బేల మాజీ సర్పంచ్ తేజారావు, కాంగ్రెస్ నాయకులు రాందాస్ నాక్లే,సంజయ్ గుండావార్, బీఆర్ఎస్ నాయకులు గంభీర్ టాక్రే, విట్టల్ వరాడే,  బీజేపీ నాయకులు  మురళీధర్ ఠాక్రే, దత్తా నిక్కం, ఉపాధ్యాయులు సంధ్య, నర్సింగ్ విద్యార్థులు తదితరులు  పాల్గొన్నారు.