Chitram news
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 1:39 pm Editor : Chitram news

మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో నూతన డాక్టర్లకు సన్మానం

మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో నూతన డాక్టర్లకు సన్మానం చేస్తున్న  మాసం అనిల్, తదితరులు

చిత్రం న్యూస్, బోథ్:ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లో గల ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ డాక్టర్ గావచ్చిన బోథ్ గ్రామ వాస్తవ్యుడు శబరిరామ్, మహిళా డాక్టర్ సురక్ష లను మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో శాలువాతో సన్మానం చేశారు. ఛైర్మన్ మాసం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి చాలా గొప్పదని తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఎందరో ప్రాణాలు కాపాడుతూ పునర్జన్మ ఇస్తున్నారన్నారు. బోథ్ కి చెందిన శబరి రామ్ కష్టపడి చదివి ఇప్పుడు డాక్టర్ అయ్యి ఊరుకి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడే నూతనంగా డాక్టర్ గా సేవలు చేయడం చాలా అభినందనీయమన్నారు. కార్యక్రమం లో దుర్గ కమిటీ అధ్యక్షుడు పాలిక్ రమేష్, తుం శివ, మందుల అశోక్, ఆడెపు సాయి విఘ్నేష్, పడిగేల మణిరత్నం, మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.